జీవీఎంసీ కమిషనర్ సృజన అనకాపల్లిలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ముందుగా నూకాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇండోర్ స్టేడియం, నూకాలమ్మ కోవెల రహదారి, 12 నెంబర్ సచివాలయం, శ్మశాన వాటిక, మురికినీటి శుద్ధి ప్లాంట్ను పరిశీలించారు. నూకాలమ్మ కోవెలకు వెళ్లే రహదారిని రూ.15 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇండోర్ స్టేడియంలో మరమ్మతులు ఆధునీకరణతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
గ్యాస్ ఆధారిత దహన వాటికని ఏర్పాటు
శారదా నది ఒడ్డున ఉన్న శ్మశాన వాటికలో గ్యాస్ ఆధారిత దహన వాటికని 94లక్షలతో ఏర్పాటు చేస్తామని వివరించారు. వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పేర్కొన్నారు.పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ నిర్మిస్తామని పేర్కొన్నారు. కొత్తూరులోని డంపింగ్ యార్డు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. శంకరంలో ని మురికి నీటి శుద్ధి ప్లాంట్ లోని మరమ్మతులు చేయడంతో పాటు చుట్టూ ప్రహరీ గోడని 94 లక్షలతో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి