ETV Bharat / state

అనారోగ్యంతో మృతిచెందిన గురుకుల పాఠశాల విద్యార్థి - gurukul schools

విశాఖపట్నం జిల్లాలోని ఓ గిరిజన గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థికి మూర్చరోగం వచ్చింది. ఆసుపత్రికి తరలించేలోపే బాలుడు మృతి చెందడంతో, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెండాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అనారోగ్యంతో విశాఖలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి మృతి
author img

By

Published : Sep 9, 2019, 4:59 PM IST

అనారోగ్యంతో విశాఖలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థి మృతి

విశాఖ గూడెంకొత్తవీధి మండలం సీలేరు గిరిజన గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న తామెర్ల సాయి అనే విద్యార్థి మృతి చెందాడు. బాలుడికి అనారోగ్యంతో మూర్చ రావడంతో పాఠశాల సిబ్బంది సీలేరు ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని,వెంటనే చింతపల్లి తీసుకెళ్లాలని సీలేరు వైద్యాధికారి సూచించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతిచెందాడు. విద్యార్థి మృతిచెందిన విషయం పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు తెలుపగా,వారు చింతపల్లికి చేరుకున్నారు. తమ కుమారుని అనారోగ్యం గురించి ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తమ కుమారుడు మృతి చెండాదని తల్లిదండ్రులు నూకరాజు, నాగమ్మలు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: కరెంట్ తీగల చోరీకి యత్నం- షాక్​తో నలుగురి మృతి

Intro:AP_VSP_56_09_STDUENT SUDDEN DEATH IN SCHOOL_AV_AP10153Body:విశాఖ జిల్లా గూడెంకొత్తవీది మండలం సీలేరు గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమద్యలో మరణించాడు. పాఠశాల నిర్వాహకులు వల్లే మా కుమారుడు మృతిచెందాడని మృతుడు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు దీనికి సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సీలేరు ఏపీ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న తామర్ల సాయి కు సోమవారం ఉదయం అనారోగ్యంకు గురై మూర్చ రావడంతో పాఠశాల సిబ్బంది సీలేరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే చింతపల్లి తీసుకెళ్లాలని సీలేరు వైద్యాధికారి సూచించగా, అంబులెన్స్‌లో చింతపల్లిలో తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందాడు. చింతపల్లి సీహెచ్‌సీకు తీసుకెళ్లగా విద్యార్థి మృతిచెందినట్లు వైద్యాధికారులు దృవీకరించారు. సాయి మృతిచెందిన విషయం జి.మాడుగుల మండలం కొక్కిరాపల్లిలో నివాసముంటున్న వారి తల్లిదండ్రులకు తెలియజేసారు. దీంతో వారు హుటాహటిని చింతపల్లికి చేరుకున్నారు. తమ కుమారుడు అనారోగ్యం గురించి పాఠశాల ప్రిన్స్‌పాల్‌ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మృతుడు తల్లిదండ్రులు నూకరాజు, నాగమ్మలు ఆరోపించారు. Conclusion:M.RAMANARAO, SILERU,AP10153
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.