లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. వీరికి అండగా నిలిచేందుకు దాతలు ముందుకొస్తున్నారు. విశాఖలో ఆసరా ఛారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో కంచరపాలెం, తాటిచెట్లపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్జెండర్లకు నిత్యావసర సరకులను అందజేశారు. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిత్యావసర సరకులను అందిస్తున్నారు.
ఇవీ చదవండి: మద్యం కొంటే వేలికి సిరా వేయించుకోవాల్సిందే!