పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగించే ప్రక్రియలో భాగంగా.. మద్యం దుకాణాలను మూసివేయటానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 13న రెండో దశ పోలింగ్ ప్రారంభం కానుండగా.. 11వ తేదీ నుంచే మద్యం దుకాణాలు మూసివేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్లో రెండో విడత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. డివిజిన్లో మెుత్తం 26 మద్యం దుకాణాలు ఉండగా.. ఈనెల 11వ తేదీ సాయంత్రం 7:30 గంటల నుంచి మూసివేయనున్నారు. ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసి.. మద్యం దుకాణాలు మూసి ఉంచేటట్లు చర్యలు తీసుకోనున్నారు. ఎన్నికల అనంతరం 14వ తేదీన మద్యం దుకాణాలు తెరుస్తారని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా దారుణం'