మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ మరణానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. నలంద కిషోర్ మృతిపట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైకాపా వేధింపులతో మనస్థాపానికి గురై కిషోర్ మృతి చెందాడని విమర్శించారు.
ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నా. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడని నలంద కిషోర్‌పై కేసులు బనాయించారు. కరోనా పరిస్థితుల్లో విశాఖ నుంచి కర్నూలుకు తరలించారు. పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పి శారీరకంగా, మానసికంగా హింసించారు. ఈ క్షోభ తట్టుకోలేకే తీవ్ర మనోవేదనకు గురయ్యాడు నలంద కిషోర్. ఆయన మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి- చంద్రబాబు, తెదేపా అధినేత
నలంద కిషోర్ మృతిపై నారా లోకేశ్ కూడా స్పందించారు. ఆయన మృతి చాలా బాధాకరమని సంతాపం ప్రకటించారు. పార్టీ ఓ క్రమశిక్షణ కలిగిన నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
ఇదీ చదవండి