ETV Bharat / state

నాడు - నేడు: కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలలు - చోడవరంలో తాజాగా నాడు-నేడు పనులు

నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ పనులు పూర్తి కావచ్చాయి. గ్రామాల్లో ప్రభుత్వ బడులు అందంగా ముస్తాబవుతున్నాయి. మౌలిక సదుపాయాలతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మారాయి.

Government school renovation work
కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ పాఠశాలు
author img

By

Published : Dec 5, 2020, 1:19 PM IST

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో నాడు - నేడు పనులు పూర్తి కావచ్చాయి. ఈ నియోజకవర్గంలోని తొమ్మిది పాఠశాలల్లో... రూ. 7.22 కోట్లు వెచ్చించి... అన్ని సదుపాయాలను కల్పించి అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలను... కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చేశారు. జుత్తాడ వంటి కుగ్రామంలోని పాఠశాల్లో అన్నిమౌలిక సదుపాయాలను కల్పించారు. విద్యుత్ వైరింగ్, గదులలో టైల్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.

చోడవరం పట్టణంలో జడ్పీ బాలికోన్నత పాఠశాలను ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఇక్కడి తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ దేవరపల్లి సూర్యకుమారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాలికోన్నత పాఠశాలను చక్కగా తయారుచేశారు. కడియం నుంచి మొక్కలను తీసుకొచ్చి నాటారు. ఏళ్ల తరబడి అక్రమణలకు గురైన పాఠశాల స్థలాలను చైర్మన్ సూర్యకుమారి.. స్వాధీనపర్చుకుని ఆధునికంగా తీర్చదిద్దారు. పనులు మరింత వేగంగా పూర్తి చేస్తామని ఇంజినీరింగ్ పర్యవేక్షకుడు తెలిపారు.

ఇదీ చదవండి:

నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నేడే ఎంట్రెన్స్ టెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.