ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే వారికి ప్రత్యామ్నాయం కల్పించాలని ఏఐటీయూసీ అనుబంధ సంస్థ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్, రాష్ట్ర సమన్వయకర్త పి.మధు కోరారు. అలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో అందోళనకు సిద్ధమైనట్లు హెచ్చరించారు.
చోడవరం, దేవరాపల్లి, అనకాపల్లి, నర్సీపట్నం, పరిధిలోని మద్యం దుకాణాల్లో పని కోల్పొయిన ఉద్యోగులు ఈ విషయంపైనే సమావేశమయ్యారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే అందోళనను ఉధృతం చేస్తామని యూనియన్ రాష్ట్ర సమన్వయకర్త మధు హెచ్చరించారు.
ఇవీ చూడండి: