ప్రభుత్వ, దేవాదాయ, ట్రస్ట్‌లకు సంబంధించిన భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు చేస్తే ఎంతటి వారినైనా.. ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. భూముల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కీలక పాత్ర రిజిస్ట్రార్లదేనని.. డాక్యుమెంట్లు,రికార్డులను పూర్తిగా పరిశీలించి ధృవీకరించుకున్న తర్వతే రిజిస్ట్రేషన్లు చేయాలన్నారు.
ఇదీ చదవండి: