ETV Bharat / state

విశాఖ జిల్లాలో మరిన్ని ఇసుక రీచ్​లకు అనుమతి...?

ఈనెల 25న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అనంతరం గృహాల నిర్మాణమూ చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో విశాఖ జిల్లాలో ఇసుక లభ్యత.. ఆశించిన స్థాయిలో లేదు. ఇందుకోసం జిల్లాలోని పలు నదులు, వాగులు, కాలువల్లో తవ్వకాలకు అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం తయారవుతోంది. కొన్ని నిబంధనలను సడలించే అవకాశాలను పరిశీలిస్తోంది.

sand reaches increase in visakha district
విశాఖ జిల్లాలో ఇసుక రీచ్​ల పెంపు
author img

By

Published : Dec 20, 2020, 6:51 AM IST

విశాఖ జిల్లాలో మరో 50 ఇసుక రీచ్​లు ఏర్పాటు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి నివాస స్థలాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. తరువాత ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకూ ప్రణాళికలు రూపొందించింది. పేదలకు గృహాల నిర్మాణానికి కనీసం 5 లక్షల టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా. పొరుగు జిల్లాల నుంచి ఇసుక కొనుగోలు చేసే స్తోమత.. గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు లేదని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని నదులు, వాగులు, కాలువల్లో ఇసుక లభ్యత మేరకు తవ్వకాలకు అనుమతులు ఇవ్వడానికి ప్రతిపాదిస్తున్నారు. ఇప్పటికే శారదానది, బొడ్డేరు, తాండవ, గోస్తినీ తదితరాల్లో అనుమతులు మంజూరుకు యోచిస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవగా.. ఆయా నదుల్లో ఇసుక లభ్యత ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు.

అసలేంటి సమస్య?

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక సేకరణకు సంబంధించి నూతన విధానాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా జిల్లాలోని నర్సీపట్నం, అనకాపల్లి, ముడసర్లోవ, చోడవరం, నక్కపల్లి, అగనంపూడి, అచ్చుతాపురం తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ఇసుక డిపోలను ఏర్పాటు చేశారు. తొలిరోజుల్లో ఈ ప్రక్రియ కాస్త ఆశాజనకంగా ఉన్నా.. అనంతరం పలు ఆరోపణలు ఊపందుకున్నాయి. కొన్నిచోట్ల వేలాది టన్నుల ఇసుక మాయమైన ఘటనలపై.. తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ డిపోల్లో ఇసుక కొరత ఏర్పడింది.

నిబంధనలు ఎలా ఉన్నాయి?

స్థానిక రీచ్​ల నుంచి ఇసుక తరలింపునకు పలు నిబంధనలు ఉన్నాయి. సొంత అవసరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఇసుకను ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. కానీ గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర అవసరాలకు రవాణా చేసినట్లయితే.. ట్రాక్టర్ యజమాని టన్నుకు రూ. 375 చొప్పున సచివాలయంలో చెల్లించి రశీదు పొందాలి. ఎడ్లబండ్ల విషయంలో ఆంక్షలు పెట్టకూడదని ఇటీవల అధికారులు నిర్ణయించగా.. అమల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని ఉన్నతాధికారులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు.

డిపోల్లో ఇసుక నిల్వలు పెంపు:

ప్రస్తుతం ఉన్న ఇసుక డిపోల్లో నిల్వలు భారీగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని ఎనిమిది డిపోల్లోనూ వినియోగదారులకు ఇసుకను అందుబాటులో ఉంచాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు వచ్చాయి. అగనంపూడి, అచ్చుతాపురం, నక్కపల్లి, నర్సీపట్నం, చోడవరం, అనకాపల్లిల్లో.. ప్రస్తుతం 2.5 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం ఇసుక కొరత ఉన్న నర్సీపట్నం, నక్కపల్లి డిపోలకు మరో వారం రోజుల్లో సరఫరా పునః ప్రారంభం అవుతుంది. భీమిలి డిపోకు ఇసుక తరలించడానికి శ్రీకాకుళం జిల్లాలోని రెండు నదుల రీచ్​లను కేటాయించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని రాగంపేట, మునికోడలి, కాటవరం నుంచి రోజుకి 1,000 టన్నులు తీసుకువస్తున్నారు. గోదావరిలో నీరు తగ్గితే సరఫరా పెంచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఒడిశాతో పోలిస్తే అధిక ధరలు:

భీమిలిలో టన్ను రూ. 1,250, మిగిలిన డిపోల్లో రూ. 1,500 చొప్పున విక్రయిస్తున్నారు. డిపో నుంచి ఇంటికి సరఫరా చేసేందుకు అయ్యే వ్యయాన్ని కొనుగోలుదారులు భరించాల్సి ఉంటుంది. ధర ఎక్కువగా ఉందని చాలా మంది వినియోగదారులు.. ఒడిశా నుంచి ఇసుకను రప్పించుకుంటున్నారు. ఏపీలోని డిపోలతో పోలిస్తే ఆ రాష్ట్ర ఇసుకపై టన్నుకు సుమారు రూ. 200 వరకు ఆదా అవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించినా.. రేటు తగ్గింపు సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

ఏఓబీలో ఈ నెల 21న బంద్​.. పిలుపునిచ్చిన మావోయిస్టులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.