విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ గౌరీశ్వర స్వామి వారి కల్యాణ మహాశివరాత్రి ఉత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. స్వామి వారి కల్యాణ ఘట్టంలో భాగంగా అఖరి రోజున పుష్పాంజలి సేవా నిర్వహించారు. గౌరీ పార్వతీ దేవిలను వివిధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం ఊయాల సేవ జరిపి హారతి ఇచ్చి గౌరీశ్వర కల్యాణ మహోత్సవానికి ముగింపు పలికారు. ఈసందర్భంగా స్వామివారిని సినీనటుడు, రచయిత తనికెళ్ల భరణి, ఎమ్మెల్యే ధర్మశ్రీ దర్శించుకున్నారు. వీరద్దరికి ఉత్సవ కమిటీ ఛైర్మన్ గూనూరు సత్యనారాయణ, కన్వీనర్, అర్చకులు కొడమంచిలి చలపతి స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవీ చూడండి..