విశాఖలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ పండుగ రోజున గోపూజ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలోని కొత్త గోశాలలో గోవులను పూజించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 200కు పైగా దేశీయ జాతులకు చెందిన గోవులు, ఎద్దులు, దూడలు ఇక్కడ ఉన్నాయి. వాటన్నింటినీ అలంకరించి, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. గోవులకు ఇష్టమైన ఆహారాన్ని, ఎండు, పచ్చగడ్డి, అరటి పండ్లను అందించారు.
సింహాచలం దేవస్థానంలో తరతరాలుగా గోపూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు అన్నింటిలోనూ కనుమ రోజు పూజలు నిర్వహించాలని ఈఏడాది దేవాదాయశాఖ ఆదేశించింది. దీంతో మరింత శోభాయమానంగా కనుమ పండుగ నాడు పశువులను పూజించి.. వాటి పట్ల తమకున్న భక్తి శ్రద్దలను చాటి చెప్పారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో కనుమ పండుగ పురస్కరించుకొని దేవాలయంలో గోపూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, సిద్ధి లింగేశ్వర స్వామి, మల్లి మనుగడవారి వీధి లోని ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోపూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి...