విశాఖ జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యల్లో భాగంగా.. శుభ శుక్రవారం ప్రార్థనలు చర్చిల్లో ఫాదర్లు, పాస్టర్ల వరకే పరిమితమయ్యాయి. నర్సీపట్నం డివిజన్లోని పలు ప్రార్థన మందిరాలు వెలవెలబోయాయి. పెద్ద బొడ్డేపల్లి, రోలుగుంట, కొత్తకోట, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ, కోటవురట్ల తదితర ప్రాంతాల్లో క్రైస్తవ మందిరాలన్నీ నిర్మానుష్యమయ్యాయి. నిర్వాహకులకు నోటీసులు జారీ చేసిన కారణంగా.. క్రైస్తవులు ఎక్కువగా చర్చిలకు వెళ్లలేదు. ఇళ్ల నుంచే ప్రార్థనలు చేశారు.
ఇదీ చదవండి: