దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని విశాఖ విమానాశ్రయంలో పట్టుకున్నారు. ఎటువంటి పన్ను చెల్లించకుండా సుమారు 1294 గ్రాముల బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకువస్తున్న నలుగురు వ్యక్తుల్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఈ నలుగురు విశాఖ చేరుకున్నారు. అధికారుల తనిఖీల్లో బంగారం తరిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు బంగారం తరిలిస్తున్నట్లు ఒప్పుకున్నారని కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ డి.కె. శ్రీనివాసన్ తెలిపారు. బంగారం స్వాధీనం చేసుకుని నిందితులను విచారిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి : 16 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత