కరోనా లాక్‌డౌన్‌తో బంగారం దుకాణాలు దాదాపు 3 నెలలు మూతపడాయి. ఆంక్షల సడలింపుతో ఇప్పుడిపుడే మళ్లీ వ్యాపారం పుంజుకుంటోంది. మార్చి మొదటి వారంలో గ్రాము 3900 రూపాయలు ఉండే బంగారం ధర....5700 రూపాయల వరకు వెళ్లింది. గత 3 రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర మళ్లీ 3 వేల రూపాయలు తగ్గింది. శ్రావణ మాసం , పెళ్లిళ్ల సమయం వల్ల... కొనుగోళ్లు పెరిగాయని దుకాణదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ కరెన్సీ విలువ పెరిగి పసిడి ధరల్లో భారీ పెరుగుదల వచ్చిందని.. తిరిగి మళ్లీ ధర తగ్గుతుందని చెప్తున్నారు. కొనుగోలు దారులకు అనుకూల సమయం మరింత ముందుందని అంటున్నారు.
కరోనా సమయంలో బంగారం వ్యాపారం జరగకపోయినా...ఇప్పుడిప్పుడే పుంజుకుంటోందని వ్యాపారులు అంటున్నారు. మహమ్మారికి రష్యా టీకా కనుక్కోవడం వల్ల.. వినియోగదారుల్లో ఉత్సాహం వచ్చి కొనుగోళ్లు మొదలయ్యాయని చెప్తున్నారు. నెల రోజుల్లో బంగారం ధర మరింత దిగివస్తుందని అంచనా వేస్తున్నారు. ఏటా బంగారం ధర 10 నుంచి 20 శాతం పెరుగుతూ ఉంటుందని... వినియోగదారులు ప్రణాళిక బద్ధంగా కొనుగోలు చేయాలని వ్యాపారులు సలహా ఇస్తునారు.
ఇదీ చదవండి.