బాలికను గర్భవతిని చేయడమే కాక, భార్య సహకారంతో ఆ గర్భం ను తొలగించే యత్నం చేసిన ఓ ప్రబుద్దుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. గర్బం తొలగించే ప్రయత్నాలు వికటించి బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. హేయమైన ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో జరిగింది. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్టు చేశారు. నిందితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. చిన్నానాటి పరిచయంతో బాలిక నిందితుడి ఇంటికి వెళ్తుడంటంతోనే ఈ దారుణం జరిగిందని డీసీపీ ఉదయ భాస్కర్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి.