విశాఖ జిల్లా జి.మాడుగుల మండలంలోని వంజరి పంచాయతీ గొందిమెలక గ్రామానికి చెందిన వంతాల చిన్నారి.. గెడ్డలో పడి మృతి చెందింది. కశింకోట పాఠశాలలో జెడ్పీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్న బాలిక.. స్నేహితులతో కలిసి సమీపంలో ఉన్న కాలువలో బట్టలు ఉతకడానికి వెళ్లింది.
ప్రమాదవశాత్తు చిన్నారి కాలుజారి కాలువలో పడి ప్రాణాలు విడిచింది. స్నేహితులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా... గ్రామస్తులతో వెళ్లి మృతదేహాని బయటకు తీశారు. అప్పటికే చిన్నారి మృతి చెందింది.
ఇవీ చూడండి: