ETV Bharat / state

చూసేవారికి 'బాహుబలి'.. చేసేవారికి 'ప్రాణహాని' - గిరిజనుల

ఆ గ్రామస్థుల చర్యలు చూసేవారికి బాహుబలి సినిమాలో హీరో చేసే విన్యాసాలు గుర్తుకొస్తాయి. ఊరు దాటి వెళ్లాలంటే ప్రాణాలకు తెగించి ప్రయాణించాలి. అలా వెళ్లకుంటే నిత్యావసరాలు తీరవు. వరద వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ ఓ బాహుబలి అవ్వాల్సిందే.

చూసేవారికి 'బాహుబలి'.. చేసేవారికి 'ప్రాణహాని'
author img

By

Published : Aug 23, 2019, 12:31 PM IST

ఇటీవల జోరుగా కురిసిన వర్షాలతో విశాఖ మన్యంలోని గిరిజనులు తల్లడిల్లిపోతున్నారు. వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున మన్యంలోని చాలా గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరీ ముఖ్యంగా చింతపల్లి మండలం ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఈ పంచాయతీలో ఉన్న 21 గ్రామాల ప్రజలు అత్యవసర పనులకు, నిత్యావసరాల కోసం ఈ సాహసం చేయక తప్పదు.

వీరు బయటకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. మామూలు రోజుల్లో అయితే అందులో నడుచుకుంటూ వెళ్లేవారు. వర్షాలతో వాగు ఉద్ధృతమవటం వారికి ప్రాణసంకటమైంది. గ్రామస్థులు అవతలి ఒడ్డుకు తాడుకట్టి దాని సహాయంతో వాగు దాటుతున్నారు. ప్రమాదకరంగా తాడుపై వేలాడుతూ ఆవలి ఒడ్డుకు చేరుకుంటున్నారు.

గత ప్రభుత్వం ఈ వాగుపైన వంతెన కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి తొలి విడతగా కోటి రూపాయలు విడుదల చేసింది. అవి వంతెన పునాదులకు సరిపోయాయి. ఆ తర్వాత నిధులు రాలేదు. వంతెన నిర్మాణం సగంలో ఆగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలినడక నిర్మాణం పూర్తిచేయాలని గిరిజనులు కోరుతున్నారు.

చూసేవారికి 'బాహుబలి'.. చేసేవారికి 'ప్రాణహాని'

ఇవీ చదవండి..

వైకాపా కార్యాలయంలో పనిచేసే వ్యక్తికి నా ఇంట్లో ఏం పని: కోడెల

Intro:తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం గోరస గ్రామంలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన మడికి అర్జున్ రావు అనే వ్యక్తి స్థానిక స్మశానవాటికలో విగత జీవిగా
ఉండడం గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అర్జునరావు సాగుచేస్తున్న భూమి విషయం పై ఘర్షణకు దిగారు అని, వారే అర్జున రావు ని హత్య చేశారని ఆరోపిస్తూ మృతదేహంతో కుటుంబ సభ్యులు వర్గీయులు స్థానిక సెంటర్లో ఆందోళనకు దిగారు. నిందితులను తక్షణమే అరెస్టు చేసి ఇ తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Body:గంప రాజు పిఠాపురం

Conclusion:7995067047
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.