విశాఖ జిల్లా పాడేరులో పలు గ్రామాల పేద ప్రజలకు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అండగా నిలిచారు. తన కుమార్తె కీర్తి మన్వితతో కలిసి నిత్యావసరాలు అందజేశారు. స్వయంగా కూరగాయలను ప్యాకింగ్ చేసి.. చింతలవీధి, కుమ్మరి పుట్టు గ్రామప్రజల ఇంటింటికీ వెళ్లి ఇచ్చారు. కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని గిడ్డి ఈశ్వరి తెలిపారు.
ఇదీ చూడండి:116 మంది అనుమానితులకు కరోనా పరీక్షలు