విశాఖలో లాక్ డౌన్ పటిష్టంగా జరుగుతోంది. ప్రజలు ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. ప్రధానంగా అత్యవసర సేవలు మాత్రమే అందుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో సైతం ప్రజలకు అవసరమైన వంట గ్యాస్ అందించడంలో డెలివరీ బాయ్‌లు నిరంతరాయంగా పనిచేస్తున్నారు. కరోనా భయం ఉన్నా... అన్ని రక్షణ చర్యలు తీసుకుని సిలిండర్లు అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి వివిధ ప్రాంతాల్లోని ఇళ్లకు తిరుగుతూ.. సుమారు 2 వేల మంది విధుల్లో భాగమవుతున్నారు. వారి సేవలపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఇదీ చూడండి: