ETV Bharat / state

"విశాఖకు సహకరించని వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులే"

GARJANA : పాలనా వికేంద్రీకరణకు మద్ధతుగా విశాఖలో గర్జన సభ నిర్వహించారు. మూడు రాజధానులకు మద్దతుగా అన్ని ప్రాంతాల్లోనూ అందరూ గొంతు ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రులు పిలుపునిచ్చారు. విశాఖ రాజధానికి సహకరించని వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులేనన్నారు.

VISAKHA GHARJANA
VISAKHA GHARJANA
author img

By

Published : Oct 15, 2022, 7:38 PM IST

విశాఖకు సహకరించని వారంతా ఉత్తరాంధ్ర ద్రోహులే

VISAKHA GARJANA : పరిపాలనా రాజధాని కావాలని ఐకాస నిర్వహించిన విశాఖ గర్జన అధికార వైకాపా పూర్తి అండదండలతో సాగింది. ఈ కార్యక్రమంలో సభాపతి తమ్మినేని సీతారాంతోపాటు మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా విశాఖలోని L.I.C జంక్షన్‌లోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీగా తరలివెళ్లి పార్క్ హోటల్ జంక్షన్ కు చేరుకున్నారు. అక్కడ వై.ఎస్. విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద సభ నిర్వహించారు. వైకాపా ర్యాలీకి వర్షం తీవ్ర ఆటంకం కలిగించింది.

ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించామని మంత్రులు తెలిపారు. మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని.. దీన్ని కప్పిపుచ్చేందుకే తెలుగుదేశం అమరావతి పాదయాత్ర పేరిట కొత్త నాటకానికి తెరలేపిందని మండిపడ్డారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ నుంచి పరిపాలన కొనసాగి తీరుతుందని ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జి వై.వి.సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జనాన్ని విశాఖ గర్జనకు తరలించారు. నగరంలోని విద్యార్థులు, డ్వాక్రా మహిళలను పెద్దఎత్తున తీసుకుని వచ్చారు. జిల్లాల నుంచి తరలించిన కొన్ని వాహనాలు చేరుకునే సరికే సభ పూర్తయ్యింది. ర్యాలీలో పాల్గొన్న అందరూ సభకు హాజరుకాలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.