విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో మారుమూల వంట్ల మామిడిలో నిండు గర్భిణి వంతల లక్ష్మి పురిటి నొప్పులతో బాధపడుతూ సమీప ఆశా వర్కర్‌ను సంప్రదించింది. ఆశావర్కర్ లక్ష్మి పిరమల్ స్వేచ్చ సంస్థ వారు ఆరు మండలాల్లో నడిపిస్తున్న ఆసరా వైద్య సిబ్బంది ఆ గ్రామంలో ఉండగా... శివాజి అనే డ్రైవర్‌కు సమాచారమిచ్చారు. సేవ సిబ్బంది వెంటనే స్పందించి తమ వాహనంతో గ్రామానికి రహదారి సరిగ్గా లేకపోయినా అక్కడకు చేరుకున్నారు. మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో వారిని తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇకనైనా తమ ప్రాంతంలో రహదారులను బాగుచేయాలని స్థానికులు కోరుతున్నారు. మన్యం గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని పిరమల్ స్వేచ్ఛా సంస్థ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి.