విశాఖ జిల్లా గొలుగొండ మండలం ఏఎల్పురంలో వాహన తనిఖీల్లో 302 కిలోల గంజాయిని.. కృష్ణదేవిపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఏజెన్సీ దారకొండ ప్రాంతం నుంచి గోనె సంచులలో నింపిన గంజాయిని హైదరాబాదు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన సలీం, హైదరాబాద్కు చెందిన విక్రమ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి.. వారి నుంచి రెండు చరవాణీలతో పాటు రూ. 2,560 నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యంలో గంజాయి ఆక్రమ రవాణా వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి