విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని నెల్లిమెట్ట వద్ద అక్రమంగా తరలిస్తున్న 2వేల 500 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి తవుడు బస్తాలు మాటున రహస్యంగా అమర్చిన బస్తాల్లో.... గంజాయిని లోడుచేసి తూర్పుగోదావరి జిల్లా తునికి తరలిస్తున్నారని పట్టణ సీఐ లక్ష్మణమూర్తి వెల్లడించారు. వీటి విలువ సుమారు 2 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందన్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు లక్ష్మణమూర్తి తెలిపారు.
ఇవి కూడా చదవండి: