విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న రూ.75 లక్షలు విలువైన గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దుల్లోని గంజాయిని కొనుగోలు చేసి.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు లారీలో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న చింతపల్లి ఎక్సైజ్ సీఐ సింహాద్రి.. సిబ్బందితో లంబసింగిలో తనఖీలు నిర్వహించారు. గంజాయిని తరలిస్తున్న నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. లారీతో సహా 940 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేశామని.. ఎక్సైజ్ సీఐ సింహాద్రి తెలిపారు.
ఇదీ చదవండి: చైనా ఆ కారణంతోనే భారత్‌ను రెచ్చగొడుతోందా?