ETV Bharat / state

విశాఖ యువతి హత్య కేసులో మరో మలుపు... తెరపైకి రౌడీ షీటర్​ కుమారుడు... - గాజువాట యువతి హత్య కేసుపై తాజా వార్తలు

విశాఖ యువతి హత్య కేసులో రౌడీషీటర్‌ కుమారుడి ప్రమేయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ఆ యువతికి పరిచయస్తుడైన రామ్‌ను కొట్టించడానికి ఇద్దరు వ్యక్తులు ఓ రౌడీషీటర్‌ కుమారుడిని ఆశ్రయించినట్లు విచారణలో తెలింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

gajuwaka girl muder case Enquiry updates
గాజువాక యువతి హత్య కేసు విచారణ
author img

By

Published : Nov 3, 2020, 1:18 PM IST

విశాఖ యువతి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ యువతికి పరిచయస్తుడైన రామ్‌ను కొట్టించడానికి ఇద్దరు వ్యక్తులు ఓ రౌడీషీటర్‌ కుమారుడిని ఆశ్రయించినట్లు గుర్తించారు పోలీసులు. రౌడీషీటర్‌ కుమారుడు డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలింది. కానీ ఆ రౌడీషీటర్‌ కుమారుడు రామ్‌పై దాడి చేసిన దాఖలాలు లేవు. డబ్బు తీసుకుని మోసం చేశాడా? లేదంటే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఏమైనా ప్రణాళికలు రచించి అమలు చేశాడా? అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. పోలీసులు మరో కేసు నమోదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇతరుల ప్రమేయంపై ఆరా..

అఖిల్‌కు సాయం చేసిన వారెవరన్న కోణంలో పోలీసులు అత్యంత నిశితంగా పరిశీలిస్తున్నారు. పోలీసులు మరికొందరి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నారు. అఖిల్‌ తండ్రిపై గతంలో రౌడీషీట్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనపై నమోదైన కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆయన సత్ప్రవర్తనతో ఉన్నందున రౌడీషీట్‌ తొలగించినట్లు గుర్తించారు. అఖిల్‌ ఉదంతంలో తండ్రి పోలీసులకు పూర్తిగా సహకరించారు.

ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు‌ ప్రభుత్వం సహకరించాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.