ETV Bharat / state

నిరాశ్రయులకు ఉచిత సరుకుల పంపిణీ కేంద్రం ఏర్పాటు - విశాఖ జిల్లా తాజా వార్తలు

చోడవరంలో లాక్​డౌన్​ సందర్భంగా ఉచిత పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిరాశ్రయులైన వారికి ఒకచోట నుంచే సాయం అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీస్​ ట్రైనీ డీఎస్పీ డా. రవికిరణ్​ తెలిపారు.

free distribution centre started in chodavaram
చోడవరంలో ఉచిత పంపిణీ కేంద్రం ఏర్పాటు
author img

By

Published : Apr 15, 2020, 6:26 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో కోవిడ్ 19 సందర్భంగా ఉచిత పంపిణీ కేంద్రం ఏర్పాటు చేశారు. మండంలంలో లాక్​​డౌన్ సందర్భంగా నిరాశ్రయులైన వారికి అందించే సాయం ఒకచోట నుంచి జరిగేలా పోలీసు ట్రైనీ డీఎస్పీ డా.రవికిరణ్ చర్యలు తీసుకున్నారు. చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఉచిత పంపిణీ కేంద్రం నుంచి సరకులు అందజేస్తారు. ఇక నుంచి సాయం చేసే వర్గాలు మండల నోడల్ ఏజన్సీని సంప్రదించాలన్నారు. నోడల్ ఏజన్సీలో తహసీల్దార్, ఎంపీడీవో, పోలీసు ఎస్సై సభ్యులుగా ఉంటారు. నోడల్ ఏజన్సీ అనమతి లేకుండా ఏ ఒక్కరూ వ్యక్తిగత సాయాలు చేయరాదని ట్రైనీ డీఎస్పీ డా. రవికిరణ్ తెలిపారు.

ఇదీ చదవండి:

పారిశుద్ధ్య కార్మికులకు అండగా 'ప్రగతి భారత్ ఫౌండేషన్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.