ఆచారాల్లో ఆడంబరాలు అవసరం లేదని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు అన్నారు. సమరసత ఫౌండేషన్, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సంబంధిత కరపత్రాలను విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆవిష్కరించారు. ఆత్మీయతలు, అనుబంధాలను పెంచడమే వేడుకల ప్రధాన ఉద్దేశమన్నారు.
రజస్వల లాంటి కార్యక్రమాన్ని బహిర్గతంగా.. అట్టహాసంగా చేసుకోవడంపై ఒకసారి ఆలోచించాలని కోరారు. పవిత్రంగా నిరాడంబరంగా చేసుకోవలసిన వాటికి కూడా అపరిమితంగా ఖర్చు చేయడం, అశ్లీల నృత్యాలతో, ధ్వని కాలుష్యంతో, ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పాడు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రజల్లో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: లోక్ అదాలత్ ద్వారా 95 కేసులు పరిష్కారం