ETV Bharat / state

విశాఖ జేసీ వేణుగోపాల్ రెడ్డా లేక విజయసాయి రెడ్డా: బండారు

విశాఖ భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం దాఖలు చేసిన సిట్​ను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను బహిర్గతం చేయాలని అన్నారు.

విశాఖ జేసీ వేణుగోపాల్ రెడ్డా లేక విజయసాయి రెడ్డా : బండారు

author img

By

Published : Nov 11, 2020, 6:48 PM IST

విశాఖ భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖలోని తెదేపా కార్యాలయంలో విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం దాఖలు చేసిన సిట్​ను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను బహిర్గతం చేయాలని అన్నారు.

ఆయనే చెప్పారు..

విశాఖలో ఇన్​సైడ్ ట్రేడింగ్ జరిగిందని విజయసాయి రెడ్డి మంగళవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో ఆరోపించినట్లు బండారు గుర్తు చేశారు.

విశాఖపై కన్నేశారు..

జగన్ అండ్ కో, విజయసాయిరెడ్డి అండ్ కోకు విశాఖ భూములపై కన్ను పడిందని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డి అల్లుడు విశాఖలోని పలు ప్రాంతాల్లో భూములను స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. ఇన్​సైడ్ ట్రేడింగ్ చేస్తూ విశాఖ ప్రతిష్టను మంటగలుపుతున్నారని అధికార పార్టీ నేతల మీద చిందులు తొక్కారు.

విశాఖ జేసీ ఎవరు ?

విశాఖ జాయింట్ కలెక్టర్​గా వేణుగోపాల్ రెడ్డిని కాకుండా విజయసాయిరెడ్డి పని చేస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. చోడవరం వైకాపా ఎమ్మెల్యే ధర్మశ్రీ.. భూములు కొన్న విషయాన్ని బయటపెట్టిన విజయసాయిరెడ్డి, బే పార్క్, కార్తీక వనం, నరవ భూముల విషయం గురించి ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు.

ఇవీ చూడండి : విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్​కే దక్కుతుంది: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.