విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో పాడేరు మండలానికి చెందిన 3144 కుటుంబాలకు 6515 ఎకరాలు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అరుకు ఎంపీ మాధవి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
పట్టా వ్యవసాయ భూముల్లో పంటలు బాగా పండించుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ల చెప్పారు. దళారుల చేతిలో పడకుండా రైతు భరోసా కేంద్రం ద్వారా గిట్టుబాటు ధర పొందాలని సూచించారు.
పాడేరు ఏజెన్సీలోనే ఎక్కువ మందికి పట్టారు...
రాష్ట్రం మొత్తం మీద 3 లక్షల ఎకరాల్లో పోడు పట్టాలు ఇవ్వగా ఒక్క పాడేరు ఏజెన్సీలో అత్యధికంగా పట్టాలు ఇచ్చారు. ఏ ప్రభుత్వం చేయలేని విధంగా భూ పట్టాల పంపిణీ జగన్ ప్రభుత్వం చేసింది. దీనికి అధికారులు అందరూ చిత్తశుద్ధితో పని చేశారు. గిరిజనులు ఇకనుంచి అడవులు నరికి పోడు చేయవద్దు. గిరిజనులు ఆర్థికంగా ఎదగాలని... దానికి అటవీశాఖ రెవెన్యూ శాఖ అధికారులు సహకరిస్తారు. _ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి
ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
గిరిజన రైతులు ఇప్పుటి వరకు ధరలు తెలీక దళారీల చేతుల్లో నష్టపోయారు. ఈ విధానంలో మార్పు రావాలి. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. - అరకు ఎంపీ, మాధవి