విశాఖ ఏజెన్సీలో రెండు రోజులుగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం వేళ వర్షాలు కురవడంతో ఉదయం పూట పొగ మంచు పరుచుకుంటోంది. దీంతో వాతావరణం వేసవికాలంలోనే చలికాలాన్ని తలపిస్తోంది. పాడేరులో ఉదయం 20 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిలో రాత్రిపూట ఫ్యాన్లు ఉంటే కానీ నిద్రపట్టదు. కానీ రెండు రోజులుగా వాతావరణం మారటంతో ప్రజలు దుప్పట్లు కప్పుకునే పరిస్థితి ఏర్పడింది. పగలు ఎండలు, సాయంత్రం వర్షం కురవడం వల్లే వేకువజామున మంచు పరుచుకుంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
పొగమంచు కప్పేసింది.. శీతాకాలం తలపిస్తోంది - paderu
విశాఖ మన్యంలోని పాడేరులో వాతావరణం చలికాలాన్ని తలపిస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మన్యమంతా మంచు దుప్పటి పరుచుకుంది.
విశాఖ ఏజెన్సీలో రెండు రోజులుగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం వేళ వర్షాలు కురవడంతో ఉదయం పూట పొగ మంచు పరుచుకుంటోంది. దీంతో వాతావరణం వేసవికాలంలోనే చలికాలాన్ని తలపిస్తోంది. పాడేరులో ఉదయం 20 డిగ్రీల కనీస ఉష్ణోగ్రత నమోదైంది. వేసవిలో రాత్రిపూట ఫ్యాన్లు ఉంటే కానీ నిద్రపట్టదు. కానీ రెండు రోజులుగా వాతావరణం మారటంతో ప్రజలు దుప్పట్లు కప్పుకునే పరిస్థితి ఏర్పడింది. పగలు ఎండలు, సాయంత్రం వర్షం కురవడం వల్లే వేకువజామున మంచు పరుచుకుంటుందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు.
Body:NARSIPATNAM
Conclusion:8008574736