విశాఖ నుంచి కర్ణాటకకు రైలు ద్వారా ఫ్లైయాష్ రవాణా ప్రారంభమైంది. కొత్త కార్గో రవాణాలో భాగంగా ఫ్లైయాషను ఎన్టీపీసీ సింహాద్రి ప్లాంట్ నుంచి కర్ణాటకలోని తొండిబావి స్టేషన్‌లోని.. ఏసీపీ సిమ్మెంట్ ప్లాంట్‌కి రవాణా చేస్తున్నారు.
విశాఖ నుంచి 944 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొండిబావి స్టేషన్‌కు కంటైనర్ల ద్వారా ఫ్లైయాష్‌ను చేరవేసేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖ నుంచి బయల్దేరిన తొలి కార్గో రైలును వాల్తేర్ డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
మెుదటగా సింహాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి నైరుతి రైల్వేలోని తొండిబావి స్టేషన్‌కి ఈ రైలు ద్వారా.. 4 వేల టన్నుల ఫ్లైయాష్ రవాణా చేశారు. రైలు ద్వారా పూర్తిగా కంటైనర్లలలో ఫ్లైయాష్ తరలింపు వల్ల పర్యావరణానికి విఘాతం కలగకుండా చేయగలిగారు.
ఇదీ చదవండి: విశాఖలో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు