ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణ లోవ జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో రెండు గేట్లు ఎత్తి జలాశయంలో చేరుతున్న అదనపు నీటిని దిగువకు వదిలారు. సుమారు పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయంలోకి వచ్చి చేరే నీటి ప్రవాహం పెరిగింది.
జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా.. 458.69 అడుగుల నీరు చేరింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు రెండు గేట్లు ఎత్తి దిగువకు నాలుగు వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ మేరకు జలాశయం దిగువ ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు.
ఇవీ చూడండి: