నేవల్ ఆల్టర్నేట్ ఆపరేటింగ్ బేస్ (ఎన్.ఎ.ఓ.బి) కోసం విశాఖ జిల్లా రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో ప్రభుత్వం మొదటి దశ భూసేకరణ పూర్తి చేసింది. ఈ భూమూల అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్ శివ శంకర్... నేవీ అధికారులకు తెలిపారు. 2005లో జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో 4 వేల 385 ఎకరాల భూమిని మొదటి దశ కింద సేకరించి, నేవీకి అప్పగించామని ఆయన చెప్పారు. విశాఖ కలెక్టర్ కార్యాలయంలో నేవీ అధికారులతో భేటీ అయిన సంయుక్త కలెక్టర్... మొత్తంగా ఈ ప్రాజెక్టు నిమిత్తం 8 వేల ఎకరాల భూమిని నేవీకి ప్రభుత్వం కేటాయించిందన్నారు.
ఇదీ చదవండి : పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి: అవంతి