ETV Bharat / state

మేఘాద్రి రిజర్వాయర్​లో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత - Reservoir at visakhapatnam district

మేఘాద్రి రిజర్వాయరు వంతెన కింద పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడటం స్థానికంగా కలకలం రేపింది. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత రిజర్వాయర్​లో చేపలు ఎవరూ తినడం లేదు. ఇటీవల అధికారులు నీటిని వినియోగించుకోవచ్చు అన్న ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు బొచ్చు చేపలు మృత్యువాత పడటం మళ్లీ అనుమానాలకు తావిస్తోంది.

fishes death in Meghadri Reservoir
మేఘాద్రి రిజర్వాయర్​లో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత
author img

By

Published : Jul 16, 2020, 5:20 PM IST

పెందుర్తి మేఘాద్రి గడ్డ రిజర్వాయర్​లో చేపలు చనిపోవడం కలకలం రేపింది. వేపగుంట పినగాడి రహదారిలో మేఘాద్రి రిజర్వాయరు వంతెన కింద బొచ్చు చేపలు చనిపోయి కనిపించాయి. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత ఈ రిజర్వాయర్​లోని చేపలను ఎవరూ తినడం లేదు. ఇటీవల జీవీఎంసీ అధికారులు నీటిని పరీక్షించిన అనంతరం వినియోగించుకోవచ్చని ప్రకటించారు.

ఇంతలో పెద్ద ఎత్తున చేపలు మృత్యువాత పడటం స్థానికులను కలవరపాటుకు గురిచేసింది. అన్ని రకాలు కాకుండా కేవలం బొచ్చు చేపలు మాత్రమే చనిపోవడం అనుమానాలకు తావిస్తోందని ప్రజలు అంటున్నారు. అధికారులు ఈ ఘటనకు గల కారణాలను పరిశీలించి వాస్తవాలు బయటపెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

కల్వర్టు కూలి ఐదేళ్లైంది.. ఎవరూ పట్టించుకోరా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.