ETV Bharat / state

పెద్ద జాలరిపేటలో నెమ్మదిగా కొనసాగుతున్న పోలింగ్​

పోలింగ్​ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా కొద్ది సమయమే మాత్రమే ఉంది. అయినా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మత్స్యకారులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎక్కువ ఓటర్లు ఉన్న కేంద్రాల్లో తక్కువ పోలింగ్ బూత్​లు ఏర్పాటు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. త్వరితగతిన ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని కోరుతున్నారు.

Fishermen not yet voting
ఓటువేయని మత్స్యకారులు
author img

By

Published : Mar 10, 2021, 4:29 PM IST

పోలింగ్‌కు ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. అయినా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని 19వ వార్డు పెద్ద జాలరిపేట ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఓట్లు వేసేందుకు మత్స్యకారులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. బారులు తీరి పడిగాపులు కాస్తున్నారు. స్థానిక పాఠశాలలో నాలుగు పోలింగ్ బూత్​లు ఉన్నా.. ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటంతో ఓటింగ్ మందకొడిగానే సాగుతోంది. త్వరితగతిన ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని స్థానిక ఓటర్లు కోరుతున్నారు.

ఇదీ చదవండి: ఓటరు స్లిప్​లపై పార్టీ గుర్తులు.. పోలింగ్​ కేంద్రాల వద్ద ప్రచారాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.