ETV Bharat / state

తప్పు చేశాను క్షమించండి మహాప్రభో! - కాళ్ల బేరానికి వచ్చిన నటి - YCP SOCIAL MEDIA ACTIVISTS ARREST

వైఎస్సార్సీపీ అండదండలతో టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకర పోస్టులు - క్షమించాలంటూ మొన్న వీడియో నిన్న లేఖ విడుదల చేసిన ఓ నటి

YSRCP Social Media Activist Apology Letter to Minister Nara Lokesh
YSRCP Social Media Activist Apology Letter to Minister Nara Lokesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 10:18 AM IST

YSRCP Social Media Activist Apology Letter to Minister Nara Lokesh : వైఎస్సార్​సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నాయకులు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారంతా ఇప్పుడు యుటర్న్​ తీసుకుంటున్నారు. సోషల్​ మీడియాలో అసభ్యకర పోస్టులపై కేసులు, అరెస్టుల నేపథ్యంలో కాళ్ల బేరానికి వస్తున్నారు. తప్పయింది, క్షమించండి అంటూ సోషల్​ మీడియాలో వీడియోలతో పాటు లెటర్లు రాస్తున్నారు. మరికొంత మంది తమ సోషల్​ మీడియా అకౌంట్​లను డీ యాక్టివేట్​ చేస్తున్నారు. కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. తమను, తమ కుటుంబ సభ్యులను క్షమించి వదిలేయాలంటూ పేజీలకు పేజీల లెటర్లు రాస్తున్నారు. ఈ తరుణంలో ఓ వైఎస్సార్సీపీ సానుభుతి పరురాలు, ఓ నటి తనను క్షమించాలంటూ బహింరంగా లేఖ రాశారు. తనను వదిలేయాలంటూ ఐదు రోజుల క్రితం ఓ వీడియోను సైతం విడుదల చేసింది. అనంతరం ఆమెపై కేసు నమోదైంది.

లోకేశ్​ అన్నా.. క్షమించు : వైఎస్సార్​సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్​కు కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పోస్టులు పెడితే పచ్చి బూతులతో రెచ్చిపోతూ వీడియోలు విడుదల చేసిన ఓ నటి ప్రస్తుతం కాళ్ల బేరానికి వచ్చింది. లోకేశ్​ అన్నా క్షమించు, తప్పయింది, మళ్లీ జీవితంలో ఇటువంటి తప్పు చేయనంటూ లెటర్​ రాసింది.

YSRCP Social Media Activist Apology Letter to Minister Nara Lokesh
నటి రాసిన లెటర్​ (ETV Bharat)

దెబ్బకు దయ్యం వదిలింది - క్షమాపణలు చెప్పిన నటి

ఆ నటి సినిమా పరిశ్రమలో తనను శారీరకంగా ఉపయోగించుకొని అవకాశాలు ఇవ్వలేదని గతంలో ఆరోపించారు. హైదరాబాద్​లో అప్పట్లో హల్​చల్​ చేశారు. తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్ వద్ద నగ్న ప్రదర్శనకు చేశారు. అనంతరం ఆ విషయం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తరువాత చెన్నైకి వెళ్లారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అనుకూలంగా వీడియోలు చేస్తోంది. ఆ పార్టీకి ఏ రాజకీయ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చట్టప్రకారం చర్యలు తీసుకుంటుండడంతో ఆ నటికి తత్వం బోధపడి సోషల్​ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కేసు నమోదైంది. ఆ అస్త్రం పని చేయకపోవడంతో బహిరంగ క్షమాపణ లేఖ విడుదల చేసింది.

'వర్మా' విచారణకు రండి - ఆర్జీవీ ఇంటికి ఏపీ పోలీసులు - కేసు ఏంటంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.