విశాఖ జిల్లా గొలుగొండ మండలం నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం వ్యవసాయ క్షేత్రంలో అగ్నిప్రమాదం జరిగింది. పశువుల పాక దగ్ధం కావటంతో.. పదుల సంఖ్యలో మూగజీవులు మృత్యువాత పడ్డాయి. సుమారు రూ.10లక్షకు పైగా ఆస్తినష్టం జరిగిందని బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. అయితే ప్రమాదానికి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలే కారణమయ్యి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి...