FIRE ACCIDENT: విశాఖ పోర్టు కార్గో బెర్త్ కన్వేయర్ బెల్ట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వేదాంత జనరల్ కార్గో బెర్త్‌లో కన్వేయర్ బెల్ట్ రన్నింగ్‌లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టమూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కన్వేయర్ బెల్ట్ ఎత్తులో ఉండడంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది.
ఇవీ చదవండి: