విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం కొండపాలెం గ్రామంలో 30 ఎకరాల్లో ఉన్న సరుగుడు, నీలగిరి తోటలు అగ్నికి ఆహుతయ్యాయి. దాదాపు రూ.19 లక్షల మేర నష్టం ఏర్పడిందని రైతులు తెలిపారు. కొత్త అమావాస్య పండుగ సందడిలో గ్రామం ఉండగా..ఈ ప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడుతుండటం, ఎండ తీవ్రత వల్ల ఆర్పే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అగ్నిమాపక శకటాలకు స్థానికులు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో గ్రామానికి చెందిన 20 మంది రైతులు నష్టపోయారు.
ఇదీచదవండి