రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో కొందరు తెదేపా నేతలు వైకాపాలో చేరారు. విశాఖలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. సింహాచలం, అడవివరం, భీమిలి నియోజకవర్గ గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు పార్టీ మారాయి. వారికి పార్టీ కండువాలు కప్పి మంత్రి స్వాగతం పలికారు.
రాష్ట్రవ్యాప్తంగా వైకాపాలోకి చేరేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ, కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని పథకాలను ప్రజలకు అందిస్తున్నారని వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు ఇవ్వని వాటినీ చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: 'ఈ మద్యం రెండు నెలలు తాగితే.. ప్రాణాలు పోతాయి'