విశాఖ జిల్లా అనకాపల్లిలో భూసమీకరణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పాపయ్య సంతపాలెంలో దాదాపు 242 ఎకరాల భూమిని సేకరించేందుకు రెవెన్యూ అధికారులు అక్కడ పర్యటించారు. గ్రామస్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూముల్ని... ప్రభుత్వానికి ఇచ్చేది లేదని అన్నదాతలు తేల్చి చెప్పారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను వ్యతిరేకించిన సీఎం జగన్... అనకాపల్లిలో ఏ విధంగా చేస్తున్నారని గ్రామస్థులు ప్రశ్నించారు. పాపయ్య సంతపాలెంలోని 138 మంది రైతుల్లో... కేవలం ముగ్గురు మాత్రమే భూములు ఇచ్చేందుకు అంగీకరించారు.
ఇదీ చదవండి: