ETV Bharat / state

ఉద్యాన పంటలపై అన్నదాతల అసక్తి

విశాఖ జిల్లాలోని రైతులు ఉద్యాన పంటలపై ఆసక్తిని కనబరుస్తున్నారు. మెరుగైన ఫలితాలు సాధిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.

అరటి గెలను చూపిస్తున్న మహిళ
అరటి గెలను చూపిస్తున్న మహిళ
author img

By

Published : Oct 19, 2020, 2:47 PM IST

సాధారణంగా ఉద్యానవన పంటలకు సంబంధించి పూలు, పండ్ల సాగులో ఉభయగోదావరి జిల్లాలు ముందుంటాయి. అదే తరహాలో విశాఖ జిల్లా గొలుగొండ మండలం లింగంపేట గ్రామానికి చెందిన రైతులు పలు పండ్ల జాతుల పెంపకంపై దృష్టి సారించారు. గ్రామానికి చెందిన వంగల లక్ష్మీ, ఆమె భర్త రమణ పండ్ల పెంపకంపై ఆసక్తితో విజయం సాధించారు.

మిగితా రైతులకు స్ఫూర్తిగా నిలిచారు. తమ పెరటిలోని అరటి తోటలో సుమారు 3 అడుగుల పొడవైన అరటి గెల పడింది. ఈ గెలకు 450కి పైగా అరటి పళ్లు ఉన్నట్లు గుర్తించగా... అరుదైన ఈ భారీ అరటికాయలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. ఇది మార్కెట్​లో రూ.800 పైగా ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చదవండి:

కన్నకూతురు కేసు పెట్టిందని తండ్రి బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.