విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన రబీ వరి పంట మునిగింది. ధాన్యం పంట పొలాల్లో మొలకెత్తాయి ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట కాస్తా నీటిపాలైందని రైతులు వాపోతున్నారు. ఎలమంచిలి రాంబిల్లి అచ్యుతాపురం మునగపాక మండలంలో 5 వేల ఎకరాల్లో వరి పంటకు అపార నష్టం జరిగింది. తడిచిపోయిన పంటలను గట్ల పైకి తెచ్చి రైతులు ఆరబెడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పొలాల్లో పర్యటించి పంట నష్టాలను అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి...గుజరాత్ నుంచి స్వస్థలాలకు ఉత్తరాంధ్ర మత్స్యకారులు