ETV Bharat / state

ఇసుక తవ్వకాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి: అయ్యన్నపాత్రుడు - sand excavations of eddy carts

ఎడ్ల బండ్లతో ఇసుక తరలిస్తూ జీవనోపాధి పొందుతున్న కూలీలకు ఇసుక తవ్వకాలకు సంబంధించి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్​కలెక్టర్​కు రైతుల తరఫున వినతిపత్రం అందజేశారు.

farmer minister ayyanna patrudu give a petition to Narsipatnam sub collector on sand excavations
ఇసుక తవ్వకాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలి: అయ్యన్నపాత్రుడు
author img

By

Published : Oct 12, 2020, 5:19 PM IST

ఇసుక తవ్వి ఎడ్ల బండ్లతో తరలించి జీవనోపాధి పొందుతున్న కూలీలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నాయకులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్​కలెక్టర్​కు రైతుల తరఫున వినతిపత్రం అందజేశారు. అయితే ఇటీవల కాలంలో ఎడ్ల బండ్ల యజమానులను ఇసుక సేకరిస్తున్నారన్న కారణంతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

1989లో అప్పటి అధికారులు ఎడ్లబండిపై ఇసుక తవ్వకాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చారని... ఆ నేపథ్యంలోనే కొంతమంది రైతులు జీవనం సాగిస్తున్నారని విన్నవించారు. ఇందుకు సంబంధించి గతంలో అధికారులు రూపొందించిన దస్త్రాలను పరిశీలించాలని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్​కు సూచించారు. డివిజన్ పరిధిలో సుమారు 200 నుంచి 300 మంది వరకు ఈ తరహా ఉపాధి పొందుతున్నారని వివరించారు. ఈ అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుని వాళ్లకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి:

పని లేక... మజూరీ చాలక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.