ETV Bharat / state

కొడుకును కాపాడుకునేందుకు.. 6 కి.మీల డోలీమోత - రోడ్లులేక మన్యం ప్రజల ఇబ్బందులు

విశాఖ మన్యంలో.. ఎక్కడో కొండ చివరన సుస్తీ చేసిన రోగికి వైద్యం చేయించడానికి మైదాన ప్రాంతానికి తెచ్చేందుకు డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని.. తల్లి, అక్క కుటుంబ సభ్యులు కలిసి డోలీలో 6 కిలోమీటర్లు మోసుకువచ్చారు.

family-members-took-the-sick-man-in-a-doli-at-vishaka-district
కొడుకును కాపాడుకునేందుకు.. 6 కి.మీల డోలీమోత
author img

By

Published : Oct 29, 2021, 10:19 AM IST

కొడుకును కాపాడుకునేందుకు.. 6 కి.మీల డోలీమోత

విశాఖ జిల్లా మన్యం గ్రామాల్లోని గిరిజనులు... కనీస రవాణా వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్య సమస్యలు వస్తే... డోలీ మోతలు తప్పడం లేదు. అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మడ్డిరాబ గ్రామానికి చెందిన గిరిజనుడు కొండతాబేలు సురేష్‌ (30) గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇతనికి వైద్యం చేయించడానికి అతని బంధువులు బాబూరావు, అప్పారావు మరికొంత మంది గిరిజనుల సహకారంతో డోలీ మోత మీద సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలోని సరియా గ్రామానికి అతికష్టం మీద అడవుల్లో నుంచి మోసుకొచ్చారు. అక్కడి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరాపల్లికి ఆటోలో తీసుకొచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

ఇదీ చూడండి: AP Cabinet decisions : ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం...త్వరలో ఆర్డినెన్స్‌ జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.