విశాఖ జిల్లా అనకాపల్లి కోర్టులో నకిలీ లాయర్‌ను అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన అనకాపల్లి పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్నం ద్వారకానగర్ కు చెందిన సంపంగి చిన బంగారు దుర్గా సురేష్(37) గంజాయి కేసులో నిందితులకు బెయిల్ విషయంపై షూరిటీ ఇవ్వడానికి అనకాపల్లి కోర్టుకి వచ్చాడు.
11వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ విజయ్ చందర్ కి దుర్గా సురేష్ తీరుపై అనుమానం వచ్చింది. దీనితో వివరాలు అరా తీశారు. సురేష్ ని గుర్తింపు కార్డు అడగ్గా.. తోకల దేవేంద్ర, విజయవాడ పేరుతో ఉన్న కార్డుని చూపించారు. సమగ్ర విచారణ చేయగా.. సురేష్ డిగ్రీ చదువు మధ్యలో ఆపేసి ఒక లాయర్ వద్ద అసిస్టెంట్‌గా ఉన్నట్లు తేలింది. పోకల దేవేంద్ర పేరుతో నకిలీ గుర్తింపు కార్డు సృష్టించిన దుర్గా సురేష్ పై అనకాపల్లి కోర్టు సీనియర్ సూపరిండెంట్ జయ పాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచారు. నిందితుడికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల పెంపు