విశాఖ మన్యంలోని ముంచంగిపుట్ మండల కేంద్రం నుంచి పెదబయలు, రూడకోట, జోలాపుట్టు, డుడుమ ప్రాంతాల వైపు వెళ్లే మార్గాలను గురువారం స్థానిక ఎస్సై ప్రసాదరావు ఆధ్వర్యంలో కల్వర్టులను ,వంతెనలను బాంబు స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు, మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో కల్వర్టులపై దృష్టి సాధించారు. కొంతకాలంగా లాక్ డౌన్ వలన జన సంచారం లేక పోవడంవలన శిక్షణ పొందిన కుక్కలతో అనుమానాస్పద ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి అసాంఘిక చర్యలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలనే ఉద్ద్యేశంతో ముందస్తు తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.
విశాఖ మన్యంలో విస్తృత తనిఖీలు - Extensive checks in Visakhapatnam district
విశాఖ మన్యంలో గల ముంచంగిపుట్ మండలంలోని పలు ప్రాంతాల వైపు వెళ్లే మార్గాలను స్థానిక ఎస్సై ప్రసాద్ రావు ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేశారు.
విశాఖ మన్యంలోని ముంచంగిపుట్ మండల కేంద్రం నుంచి పెదబయలు, రూడకోట, జోలాపుట్టు, డుడుమ ప్రాంతాల వైపు వెళ్లే మార్గాలను గురువారం స్థానిక ఎస్సై ప్రసాదరావు ఆధ్వర్యంలో కల్వర్టులను ,వంతెనలను బాంబు స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేశారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు, మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతం కావడంతో కల్వర్టులపై దృష్టి సాధించారు. కొంతకాలంగా లాక్ డౌన్ వలన జన సంచారం లేక పోవడంవలన శిక్షణ పొందిన కుక్కలతో అనుమానాస్పద ప్రాంతంలో విస్తృతంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి అసాంఘిక చర్యలకు అవకాశం ఇవ్వకుండా ఉండాలనే ఉద్ద్యేశంతో ముందస్తు తనిఖీలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:'ఆవులకు మేత లేదు.. దయచేసి స్పందించండి'