ETV Bharat / state

Report on Rudakota deaths: ‘రూఢకోట’ శిశుమరణాల వెనుక.. నివ్వెరపోయే నిజాలు..! - ఏపీ వార్తలు

Report on Rudakota deaths: రూఢకోటలోని శిశుమరణాలన్నీ ఒకే తీరుగానే ఉన్నాయని నిపుణుల కమిటీ తెలిపింది. శిశువుల కాళ్లు, చేతులు నీలుక్కుపోతుండగానే తల వెనక్కి వాల్చి తుదిశ్వాస విడిచినట్లు నిపుణులు తెలిపారు. ఈ మరణాలకు దారితీసిన కారణాలు పూర్తిగా తెలియాలంటే.. మంచి నీటి నాణ్యతను, స్థానికుల ఆహార అలవాట్లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కమిటీ స్పష్టం చేసింది.

Report on Rudakota deaths
Report on Rudakota deaths
author img

By

Published : Jan 6, 2022, 9:54 AM IST

Report on Rudakota deaths: విశాఖ జిల్లా రూఢకోటలో శిశువుల మరణాలన్నీ ఒకే వీధిలో.. ఒక్క తీరుగానే ఉన్నాయి. శిశువుల కాళ్లు, చేతులు నీలుక్కుపోతుండగానే తల వెనక్కి వాల్చి తుదిశ్వాస విడిచినట్లు నిపుణుల కమిటీ పరిశీలనలో గుర్తించారు. అయితే ఈ మరణాలకు దారితీసిన కారణాలు తెలియాలంటే... మంచి నీటి నాణ్యతను, స్థానికుల ఆహార అలవాట్లను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని విచారణ కమిటీలు స్పష్టం చేశాయి. రూఢకోట గ్రామ పరిధిలోని ఒకే వీధిలో శిశు మరణాలన్నీ నమోదవడం చర్చనీయాంశమైంది. 8 మరణాలు శిశువులు జన్మించిన 60 నుంచి 70 రోజుల మధ్య నమోదయ్యాయి.

2018 మే 31 నుంచి డిసెంబరు 15 మధ్య 14 మంది శిశువులు మరణించారు. ఇందులో 8 మరణాలు గత 9 నెలల వ్యవధిలో సంభవించాయి. ఈ మరణాలకు దారితీసిన కారణాలపై వైద్య, ఆరోగ్యశాఖ, గిరిజన సంక్షేమశాఖ బృందాలు వేర్వేరుగా అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. పాడేరుకు 46 కిలోమీటర్లు, పెదబయలు మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు నివసిస్తున్నారు.

గుర్తించిన అంశాలు..

  • శిశువుల మరణాలు అత్యధికంగా అర్ధరాత్రి పూట సంభవించాయి.
  • తీవ్రస్థాయిలో ఏడుస్తూ.. వాంతులు చేసుకుంటూ 6 నుంచి 12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. శ్వాస పీల్చుకోవడంలో శిశువులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఒక శిశువులో ఫిట్స్‌ లక్షణాలు కనిపించాయి.
  • స్థానికులు తాగే మంచినీటి నాణ్యతలోనే సమస్య ఉన్నట్లు అనిపిస్తోందని గిరిజన సంక్షేమశాఖ అధ్యయన బృందం అభిప్రాయపడింది. నీటి పైపు లైన్ల వ్యవస్థ అస్త్యవ్యస్తంగా ఉంది. ప్రాథమికంగా ఎఫ్‌టీకే పరీక్షలో నాణ్యత బాగానే ఉందని వచ్చినా... సూక్ష్మస్థాయిలో పరీక్షలు జరగాలంది.

ఇదీ చదవండి: GOVERNOR ON INFANT MORTALITY: విశాఖ మన్యంలో శిశు మరణాలపై గవర్నర్ ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.