విశాఖపట్నం జిల్లా రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు కేఎస్ఎన్ఎస్ రాజు కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రక్షణ కవచాలు ధరించడం, సామాజిక దూరం పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కేఎస్ఎన్ఎస్ రాజు ఇంటి నుంచి బయటకు ఎన్.95 మాస్క్‌ను, ఆపై ఫేస్ షీల్డ్ మొఖానికి పెట్టుకుని, చేతులకు గ్లౌజులు ధరించి మరీ వస్తారు. బయటకు వచ్చిన అందరూ వ్యక్తిగత దూరం పాటించేలా మరింత శ్రద్ధ చూపుతారు. లాక్ డౌన్ సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన ఆయన రెండు రోజులుగా పార్టీ తరుపున ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇవీ చూడండి:నవరత్నాలకే ప్రాధాన్యం.. బడ్జెట్ అంచనా రూ.2.30 లక్షల కోట్లు..!