జగన్‌కి దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి వాలంటీర్లని పోటీలో పెట్టాలని... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. పులివెందుల పిల్లిని పోటీకి దింపినా సరేనంటూ... జోగి రమేష్ చేసిన సవాల్‌పై ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం నేతలపై వాలంటీర్లని పెట్టి గెలిపిస్తానని జోగి రమేశ్ అంటుంటే.. పులివెందుల పిల్లి తెదేపా ఎమ్మెల్యేకు ఎందుకు వైకాపా కండువా కప్పుతోందని నిలదీశారు. చేతనైతే గన్నేరుపప్పుని లైవ్‌లోకి తీసుకురావాలని... అప్పుడు ఎవడి సత్తా ఏంటో తేలిపోతుందని స్పష్టం చేశారు. తెలుగుకి తెగులు పట్టిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున జగన్ చేసిన పదవిన్యాసం ఇంకా మర్చిపోలేకపోతున్నామని అయ్యన్న ఎద్దేవా చేశారు. ముందు జగన్‌కి (అ,ఆ)లు నేర్పాలని హితవు పలికారు.
ఇదీ చదవండీ... వైకాపా దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం : చంద్రబాబు